గ్రహం అనుగ్రహం (19-07-2019)

Daily Rasi Phalalu in Telugu (19-07-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.తదియ పూర్తి (24 గంటలు), నక్షత్రం ధనిష్ఠ రా.2.56 వరకు, తదుపరి తభిషం, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.03 వరకు తదుపరి ప.12.29 నుంచి 1.21 వరకు అమృతఘడియలు... ప.3.24 నుంచి 4.33 వరకు.

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: చేపట్టిన పనులలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: శ్రమపడినా ఫలితం కనిపించదు. పనులలో అవరోధాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: సోదరులతో కొద్దిపాటి విభేదాలు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం.

సింహం: పనులు విజయవంతంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో కీలక మార్పులు. ఆహ్వానాలు అందుతాయి. ధనలబ్ధి.

కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు అధికం.

తుల: పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: కొత్త ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

ధనుస్సు: ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.

మకరం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ధన,వస్తులాభాలు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆస్తి వివాదాలు.  వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దైవదర్శనాలు.

మీనం: ఆకస్మిక ధనలాభం. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం.  విందువినోదాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top