గ్రహం అనుగ్రహం (05-12-2019) | Daily Rasi phalalu in Telugu (05-12-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (05-12-2019)

Dec 5 2019 6:18 AM | Updated on Dec 5 2019 6:18 AM

Daily Rasi phalalu in Telugu (05-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.నవమి రా.3.01 వరకు తదుపరి, దశమి, నక్షత్రం పూర్వాభాద్ర రా.7.50 వరకుతదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.44 వరకు, తదుపరి ప.2.25 నుంచి 3.09 వరకుఅమృతఘడియలు... ఉ.10.57 నుంచి 11.24 వరకు.

సూర్యోదయం :    6.19
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం:    ఆకస్మిక ధనలబ్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు మందగిస్తాయి. నిర్ణయాలు మార్పుచుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. అనారోగ్యం.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement