గ్రహం అనుగ్రహం (04-06-2020)

Daily Rasi Phalalu In Telugu (04-06-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.చతుర్దశి రా.3.02 వరకు, తదుపరి పౌర్ణమినక్షత్రం విశాఖ సా.6.30 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యంరా.10.16 నుంచి 11.47 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుంచి 10.38 వరకు, తదుపరి ప.2.58 నుంచి 3.50 వరకు అమృతఘడియలు... ఉ.10.11 నుంచి 11.44 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం:నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: సోదరులతో సఖ్యత. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు.  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

మకరం: ఇంట శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. బం«ధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం: రుణాలు చేస్తారు. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మీనం: వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top