గ్రహం అనుగ్రహం (23-05-2020) | Daily Horoscope in Telugu (23-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (23-05-2020)

May 23 2020 6:19 AM | Updated on May 23 2020 6:19 AM

Daily Horoscope in Telugu (23-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.పాడ్యమి రా.11.34 వరకు, తదుపరి విదియ, నక్షత్రం రోహిణి తె.4.32 వరకు (తెల్లవారితే ఆదివారం), వర్జ్యం. రా.8.02 నుంచి 9.44 వరకు దుర్ముహూర్తం ఉ.5.31 నుంచి 7.13 వరకు అమృతఘడియలు... రా.12.55 నుంచి 1.43 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.23
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం: ఏ ప్రయత్నమైనా నిదానంగా సాగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం:సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

మిథునం:వ్యవహారాలు ముందుకు సాగవు. ఒప్పందాలు వాయిదా. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికలిగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. పనుల్లో పురోభివృద్ధి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

సింహం: ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతోషకరంగా గడుపుతారు.

కన్య:పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

తుల:రుణ దాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. దైవచింతన. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

వృశ్చికం:కొత్త మిత్రుల పరిచయం. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. వ్యవహారాలు సకాలంలో సరిదిద్దుతారు. ప్రముఖుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

ధనుస్సు:కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరతాయి. బం«ధువులతో తగాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం:పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.  వ్యయప్రయాసలు. బం«ధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: మిత్రుల నుంచి శుభవార్తలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.  సమాజంలో ప్రత్యేక గౌరవం. భూములు కొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement