గ్రహం అనుగ్రహం (23-04-2020)

Daily Horoscope in Telugu (23-04-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి అమావాస్య ఉ.7.06 వరకు, తదుపరి వైశాఖ శు.పాడ్యమి నక్షత్రం అశ్వని ప.3.25 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉ.10.57 నుంచి 12.45 వరకు, తిరిగి రా.1.53 నుంచి 3.25 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు అమృతఘడియలు... ఉ.7.24 నుంచి 9.12 వరకు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

మిథునం:మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు. .

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. .

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి.

తుల: శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. గృహ, వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. .

వృశ్చికం:ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.

ధనుస్సు: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. ఆరోగ్యభంగం.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం.

కుంభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top