గ్రహం అనుగ్రహం (16-08-2019) | Daily Horoscope in Telugu (16-08-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (16-08-2019)

Aug 16 2019 6:37 AM | Updated on Aug 16 2019 6:37 AM

Daily Horoscope in Telugu (16-08-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.పాడ్యమి సా.6.11 వరకు, తదుపరి విదియ నక్షత్రం ధనిష్ఠ ఉ.10.11 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం సా.6.10 నుంచి 7.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.30 నుంచి 1.21 వరకు, అమృతఘడియలు... తె.4.25 నుంచి 5.46 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.23
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం:పనుల్లో విజయం. ఆప్తులు,శ్రేయోభిలాషులు సహాయపడతారు. నూతన విద్యావకాశాలు. ప్రముఖులు పరిచయం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి.

వృషభం:సన్నిహితులతో వివాదాలు సద్దుకుంటాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం:మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. విద్యార్థులకు శ్రమ. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కర్కాటకం: శ్రమానంతరం పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. బంధువుల నుంచి పిలుపు. ధనవ్యయం. వ్యాపారాలలో కొన్ని ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సింహం: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కన్య: ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

తుల:మిత్రులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి కొద్దిపాటి సమస్యలు. దైవచింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో ఇబ్బందులు.

వృశ్చికం:సన్నిహితులు ఒత్తిడులు పెంచుతారు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బదులు ఎదురవుతాయి.

ధనుస్సు: ఆర్థిక విషయాలలో పురోగతి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మకరం:వ్యవహారాలు మందగిస్తాయి. శ్ర మాధిక్యం.  బంధుమిత్రులతో విభేదా  లు. అనారోగ్యం. ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుంభం: నూతన విద్యావకాశాలు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత చికాకులు.
– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement