గ్రహం అనుగ్రహం

Daily Horoscope In Telugu (12-07-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం, తిథి బ.సప్తమి ప.2.34
వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.8.08 వరకు, తదుపరి రేవతి
వర్జ్యం రా.9.25 నుంచి 11.11 వరకు
దుర్ముహూర్తం సా.4.49 నుంచి 5.43 వరకు, అమృతఘడియలు... ఉ.8.04 నుంచి 9.34 వరకు.

సూర్యోదయం        :  5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

గ్రహఫలం..

మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. 

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. 

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తిలాభం. వృత్తి,వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. 

కర్కాటకం:పరిస్థితి అంతగా అనుకూలించదు. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. 

సింహం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. రుణయత్నాలు. బంధువులను కలుసుకుంటారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. 

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.  వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

తుల: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయ దర్శనాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూలం. 

వృశ్చికం: వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. విద్యార్థులకు ఒత్తిడులు. 

ధనుస్సు: బంధువులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు. అనారోగ్య సూచనలు. 

మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కుంభం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. అంచనాలలో పొరపాట్లు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు గందరగోళం. 

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. 
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top