గ్రహం అనుగ్రహం (11-01-2020) | Daily Horoscope in Telugu (11-01-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (11-01-2020)

Jan 11 2020 6:15 AM | Updated on Jan 11 2020 6:15 AM

Daily Horoscope in Telugu (11-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.పాడ్యమి రా.12.00 వరకుతదుపరి విదియ, నక్షత్రం పునర్వసు ప.2.50 వరకుతదుపరి పుష్యమి, వర్జ్యం రా.10.32 నుంచి 12.05 వరకుదుర్ముహూర్తం ఉ.6.37 నుంచి 8.07 వరకుఅమృతఘడియలు... ప.12.29 నుంచి 1.34 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.39
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: ఇతరులకు సైతం సాయపడతారు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మిథునం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కర్కాటకం: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

సింహం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆధ్యాత్మిక చింతన.  ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల:  నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ధన, వస్తులాభాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

దనుస్సు:పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. వైద్యసేవలు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. ధనలాభం. నూతన ఒప్పందాలు. ఆస్తిలాభ సూచనలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులసాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement