గ్రహం అనుగ్రహం (08-07-2020) | Daily Horoscope in Telugu (08-07-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (08-07-2020)

Jul 8 2020 6:00 AM | Updated on Jul 8 2020 6:00 AM

Daily Horoscope in Telugu (08-07-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.తదియ ఉ.9.11 వరకు తదుపరి చవితి, నక్షత్రం ధనిష్ఠ రా.1.46 వరకుతదుపరి శతభిషం, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.31 వరకుఅమృతఘడియలు... ప.3.01 నుంచి 4.40 వరకు.

సూర్యోదయం :    5.35
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కర్కాటకం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం: ఉద్యోగాలలో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. పనుల్లో పురోగతి. వాహనసౌఖ్యం. శుభవర్తమానాలు. పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా సాగుతారు.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. బంధువర్గంతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం:కొన్ని పనులు నిదానిస్తాయి. స్వల్ప ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు.

ధనుస్సు:కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. సన్నిహితులతో చర్చలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని స్థితి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల పరిష్కారం.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు.

మీనం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆసక్తికర సమాచారం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement