గ్రహం అనుగ్రహం (02-05-2020) | Daily Horoscope in Telugu (02-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (02-05-2020)

May 2 2020 6:09 AM | Updated on May 2 2020 6:09 AM

Daily Horoscope in Telugu (02-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి శు.నవమి ఉ.6.54 వరకు, తదుపరి దశమి తె.5.04 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం మఖ రా.7.34 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం, ఉ.8.09 నుంచి 9.41 వరకు దుర్ముహూర్తం ఉ.5.37, నుంచి 7.19 వరకు, అమృతఘడియలు...సా.5.14 నుంచి 6.55 వరకు.

సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం:
మేషం: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యసమస్యలు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వాహనయోగం.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బందువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు నూతన అవకాశాలు. వాహనయోగం.

కన్య:  ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. బంధువులను కలుస్తారు.

తుల: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అందరిలోనూ గుర్తింపు

వృశ్చికం: కొత్త ఉద్యోగప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు: కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దుబారా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు.

మకరం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కష్టపడ్డా çఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు

కుంభం: కొత్త పనులు ప్రారంభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. వాహన ,గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement