గ్రహం అనుగ్రహం (09-12-2019) | Daily Horoscope inTelugu (09-12-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (09-12-2019)

Dec 9 2019 5:57 AM | Updated on Dec 9 2019 5:57 AM

Daily Horoscope inTelugu (09-12-2019) - Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. మార్గశిర మాసం. తిథి శు.ద్వాదశి ఉ.8.45 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం భరణి తె.4.53 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి కృత్తిక. వర్జ్యం ప.1.23 నుంచి 3.06 వరకు. దుర్ముహూర్తం ప.12.13 నుంచి 12.57 వరకు, తదుపరి ప.2.25 నుంచి 3.09 వరకు. అమృత ఘడియలు రా.11.41 నుంచి 1.23 వరకు.

సూర్యోదయం: 6.22 సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం:    కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలలోపాల్గొంటారు. ధనప్రాప్తి. సంఘంలో ఆదరణ. చేపట్టిన పనులలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.

వృషభం: సన్నిహితులు, బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. ఆసక్తికర సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు సమయానికి పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

తుల: శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకమే.

మకరం: కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కుంభం: వ్యవహారాలలో విజయం. బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

మీనం: కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
 
Advertisement
Advertisement