'మరో ఉద్యమానికి తెరలేపుతారు' | YV Subba Reddy visits Ongole Tobago Centre | Sakshi
Sakshi News home page

'మరో ఉద్యమానికి తెరలేపుతారు'

Jul 28 2014 2:38 PM | Updated on Sep 2 2017 11:01 AM

'మరో ఉద్యమానికి తెరలేపుతారు'

'మరో ఉద్యమానికి తెరలేపుతారు'

రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారని ఒంగోలు లోక్సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ఒంగోలు: రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారని ఒంగోలు లోక్సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుంటే రైతులు త్వరలో మరో ఉద్యమానికి తెరలేపుతారని హెచ్చరించారు.

ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పొగాతు రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర వాణిజ్య మంత్రితో మాట్లాడుతానని చెప్పారు. పంట దిగుబడి ఎక్కువైతే పెనాల్టీ వేసే నిబంధన రద్దు చేయాలని వాణిజ్య మంత్రిని కోరుతానని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement