ఎన్టీఆర్ పార్టీలో ఉండి అలా మాట్లాడతారా? | ysrcp women mla condmen buchaiah chowdary comments on roja | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పార్టీలో ఉండి అలా మాట్లాడతారా?

Dec 22 2014 3:27 PM | Updated on May 29 2018 3:35 PM

ఎన్టీఆర్ పార్టీలో ఉండి అలా మాట్లాడతారా? - Sakshi

ఎన్టీఆర్ పార్టీలో ఉండి అలా మాట్లాడతారా?

తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఖండించారు.

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఖండించారు.

కళాకారుడు స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలో ఉన్న నాయకులు కళాకారులను అవమానించేలా వ్యవహరించడం శోచనీయమని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరకమైన ప్రవర్తన మానుకోవాలని హితవు పలికారు. ఆత్మస్తుతి, పరనింద తరహాలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సభ్యసమాజం తలదించుకునేలా అధికార ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మరో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరు కళాకారులే కదా అని గుర్తు చేశారు. షరతులతో రుణమాఫీ చేస్తామని ఎన్నికలకుముందు ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement