ఉల్లికల్లు వాసులను ఆదుకుంటాం

YSRCP Navaratnalu Campaign in Anantapur - Sakshi

తలారి పీడీ రంగయ్య, జొన్నలగడ్డ పద్మావతి

ఉల్లికల్లులో జోరుగా ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’  

జగన్‌ ప్రకటించిన నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి  

అనంతపురం, శింగనమల: చాగల్లు రిజర్వాయర్‌ ముంపు గ్రామాల్లో నిర్వాసితులైన ఉల్లికల్లు వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఉల్లికల్లు గ్రామంలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓ మాదిరిగా నీరు వచ్చిన సమయంలోనే గ్రామంలోకి నీరు వస్తే, రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో నీరు వస్తే  పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఉల్లికల్లు వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.  

నియోజకవర్గంలోని ఉల్లికల్లు గ్రామంలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని బుధవారం వారు ప్రారంభించి, మాట్లాడారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ ప్రవేశపెట్టనున్న పలు పథకాలపై ప్రజలను చైతన్యపరిచారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే పేదల అభ్యు న్నతి సాధ్యమవుతుందనిఅన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకం,  పేదలకు పక్కా గృహాలు,    అమ్మఒడి, రైతు భరోసా తదిత ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  

కార్యక్రమంలో  పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, మండల కన్వీనర్‌ చెన్నకేశవులు, నాయకులు శ్రీరామిరెడ్డి, మాజీ సర్పంచ్‌  శ్రీనివాసరెడ్డి, పరంధామరెడ్డి, కోనారెడ్డి, రాజు, వెంకట నారాయణ, మహిళ నేతలు బండి లలిత కళ్యాణి, చెన్నమ్మ, శకుంతలమ్మ పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top