వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కిడ్నాప్ | ysrcp mptc member kidnaped in prakasam district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కిడ్నాప్

Jul 3 2014 1:32 AM | Updated on May 25 2018 9:17 PM

ప్రకాశం జిల్లా చీరాల రూరల్ మండలం కొత్త కావూరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ హుస్సేనమ్మ, అమె అక్క కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల రూరల్ మండలం కొత్త కావూరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ హుస్సేనమ్మ, అమె అక్క కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ మేరకు హుస్సేనమ్మ భర్త శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు కలసి బుధవారం రాత్రి చీరాల వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గతనెల 26వ తేదీన పట్టణంలోని పాలేటి రామారావు హాస్పిటల్ వద్ద గవినివారిపాలెం గ్రామానికి చెందిన గవిని శ్రీనివాసరావు, మరో ఇద్దరు కలసి తన భార్యతో పాటు ఆమె అక్కను కూడా కిడ్నాప్ చేసినట్లు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement