దేవినేని ఉమా మానసిక రోగి..

YSRCP MLA Sudhakar Babu Fires On Devineni Uma - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు

సాక్షి, తాడేపల్లి: దేవినేని ఉమా ఓ మానసిక రోగి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. శనివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌లా ఆయన నడవడిక మారిందని ధ్వజమెత్తారు. చవకబారు నాయకులతో పోటీ పడాలంటే సిగ్గుగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇలానే మాట్లాడితే 23 నుంచి 3 సీట్లకు వెళతారని విమర్శించారు. అబద్ధాల ఛాంపియన్‌గా మారినందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ఎన్ని డెడ్‌లైన్లు పెట్టారో అందరికి తెలుసునని, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైఎస్సారేనని ఆయన చెప్పారు.(రాజధాని భూముల అవినీతిపై సిట్‌ ఏర్పాటు)

సజ్జల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు..
ఫ్లోరైడ్‌ బాధితులకు తాగు,సాగు నీరందించాలన్నది ఆనాటి వైఎస్సార్‌ లక్ష్యమని సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. వెలిగొండను గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. వెలిగొండ టన్నెల్‌ కూడా సీఎం జగన్‌ పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును 2018 డిసెంబర్‌కు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత 2019 అన్నారు.. కమీషన్ల కోసమే గత పాలకులు కక్కుర్తి పడ్డారని’  సుధాకర్‌బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన తప్పులన్నీ బయటకొస్తున్నాయనే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత దేవినేని ఉమాకు లేదని.. దమ్ముంటే చర్చకు రావాలని సుధాకర్‌ బాబు సవాల్‌ విసిరారు.
(ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top