‘టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభం’ | ysrcp mla chintala ramachandra reddy criticize the tdp government | Sakshi
Sakshi News home page

‘టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభం’

Jul 21 2017 7:57 PM | Updated on Oct 30 2018 4:19 PM

‘టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభం’ - Sakshi

‘టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభం’

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

పీలేరు: కర్నూల్ జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభమౌతుందని ఆయన అన్నారు. శుక్రవారం  నంద్యాల నియోజక వర్గ పరిధిలోని గోస్పాడు మండలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డితో కలసి ఆయన విస్త్రృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి  ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నంద్యాల నియోజక వర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

ఓటమి భయంతో సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా గెలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. బాబువన్నీ వాగ్ధాన భంగాలేన్న విషయం నంద్యాల నియోజక వర్గ ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. టీడీపీకి ఉప ఎన్నికల్లో బుద్ది చెప్పడం కోసం ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగాన్నంతా నంద్యాలలో కేంద్రీకృతం చేసి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి మండలి అంతా మకాం వేసి ప్రజలను తీవ్ర భయబ్రాంతుకు గురిచేస్తోందన్నారు.

ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం ఆచరణకు సాధ్యం కాని హామీలతో ఇక ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరని తెలిపారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేని సీఎం నంద్యాల ప్రజలను మోసం చేయడం కోసం రోజుకో ప్రకటన, పూటకో వాగ్ధనంతో మళ్లీ మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారంలో ఇక్కడి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement