సోమిశెట్టీ.. నోరు అదుపులో పెట్టుకో | YSRCP Leaders Slams Somisetty Venkateswarlu | Sakshi
Sakshi News home page

సోమిశెట్టీ.. నోరు అదుపులో పెట్టుకో

Jan 12 2019 1:10 PM | Updated on Jan 12 2019 1:10 PM

YSRCP Leaders Slams Somisetty Venkateswarlu - Sakshi

మాట్లాడుతున్న కరుణాకర్‌ రెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కూడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకొని..పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. ఇది చరిత్రాత్మకమవడంతో టీడీపీ నేతల్లో వణుకు పుడుతోందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత సోమిశెట్టికి లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిందె నీళ్లతో చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు నటించడం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే చెల్లుతుందన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు పెరుగు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement