వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ | ysrcp leaders rally in kadapa over protocol, Trafficking cases | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ

Jun 22 2016 12:34 PM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ - Sakshi

వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ

రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగితే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి అన్నారు.

కడప: రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగితే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కడపలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. అవినీతిపై పోరాడుతున్నందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement