వైఎస్సార్ సీపీలో 20 మంది నాయకులకు పార్టీ పదవులు


 ఏలూరు (మెట్రో) : జిల్లాకు చెందిన 20 మంది నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని పలువురు నేతలకు రాష్ట్ర, జిల్లా, మండల, మునిసిపల్‌స్థాయిలో పదవులు లభించాయి.



 రాష్ట్రస్థాయిలో.. నిడదవోలుకు చెందిన రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముళ్లపూడి శ్రీనివాస చౌదరి, చిట్యాల వెంకట్‌లను నియమించారు.

 

 జిల్లాస్థాయిలో..

 జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉప్పులూరి రామ్మోహన్, గారపాటి ప్రసాద్, యాళ్ల రామారావు, పాటంశెట్టి మల్లేశ్వరరావు, పెంటపాటి ప్రసాద్, షేక్ వజీరుద్దీన్, రావి వెంకటేశ్వరరావు, ఆరుగొల్లు వెంకటేశ్వరరావు, కరణం ప్రసాద్‌లను నియమించారు



మండల స్థాయిలో.. 

నిడదవోలు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడిగా ఐనీడి పల్లారావు, మునిసిపాలిటీ అధ్యక్షుడిగా మద్దిపాటి ఫణీంద్ర నియమితులయ్యారు. నిడదవోలు బీసీ సెల్ విభాగం అధ్యక్షుడిగా వెలగాన వెంకట సత్యనారాయణ, యువజన విభాగం అధ్యక్షుడిగా కొప్పుల రామ్‌దేవుడు, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా గుమ్మాపు రోహిన్‌బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బోనేపల్లి ఉమాదేవి, మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా షేక్ మీరా సాహెబ్, రైతు విభాగం అధ్యక్షుడిగా కస్తూరి సాగర్, ప్రచార విభాగం అధ్యక్షుడిగా పుల్లూరి రామ్మూర్తి, సేవాదళ్ విభాగం అధ్యక్షులుగా పులిమెంతుల రామారావు, లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఇంజే శేఖర్‌లను నియమించారు.





 మునిసిపాలిటీ స్థాయిలో..

మునిసిపల్ యువజన విభాగం అధ్యక్షుడిగా గోపిరెడ్డి శ్రీనివాస్,  బీస్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ముంగంటి కృపానందం, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా గుర్రం జేమ్స్, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా పెండ్ర సతీష్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉసురుమర్తి సరస్వతి, మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా షేక్ మస్తాన్ వలీ, రైతు విభాగం అధ్యక్షుడిగా కొండాటి గంగరాజు, లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా డేగపాటి మహేష్, ప్రచార విభాగం అధ్యక్షుడిగా కొండా విజయకృష్ణ ఫణీంద్ర, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ప్రక్కి సత్య సూర్యనారాయణ మూర్తి, సేవాదళ్ విభాగం అధ్యక్షుడిగా దాకే అనిల్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top