బాబు వైఫల్యంతోనే రాష్ట్రం అధోగతి

ysrcp leaders Concern programs to Special status - Sakshi

స్కేయూ: సీఎం చంద్రబాబు పాలనా వైఫల్యంతోనే రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం గత రెండు రోజులుగా ఎస్కేయూ వేదికగా వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం వంటా–వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తే రాయితీలతో కూడిన పరిశ్రమలు వస్తాయని,  

తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే అరెస్ట్‌ చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు ధోరణితో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు మీద నమ్మకం లేకపోవడంతోనే కేంద్రం ఆశించినంత స్థాయిలో నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడమే ఇందుకు కారణమన్నారు.  అనంతపురం నియోజకవర్గ సమన్వయ కర్త నదీం అహమ్మద్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోనే పన్నురాయితీ, జీఎస్టీ, అమ్మకం పన్ను రాయితీలు లభిస్తాయని,  ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి  వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు.

కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాగే పరుశురాం, చవ్వా రాజశేఖర్‌ రెడ్డి, వైవీ శివా రెడ్డి, అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌ రెడ్డి, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీ లింగారెడ్డి, మద్ది రెడ్డి నరేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హనుమంతురెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు భాను ప్రకాష్‌రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాసరెడ్డి, జయచంద్రారెడ్డి , అశోక్‌రెడ్డి, తిరుపాల్‌నాయక్, హేమంత్, రాజా రెడ్డి, మనప్రీతిరెడ్డి, పునీత్, భవిత్‌రెడ్డి , జిల్లా ప్రధాన కా ర్యదర్శులు పెద్దన్న, బాబా సలాం యువజన విభాగం నగర అధ్యక్షుడు నాయుడు, బాలకృష్ణారెడ్డి, బిల్లే మం జునా«థ్, నూర్‌ మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top