పవన్‌ స్థిరత్వం లేని నాయకుడు

YSRCP Leaders Comments On Chandrababu - Sakshi

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

సాక్షి, శ్రీకాకుళం: లక్ష కోట్ల రాజధాని ఏపీ అభివృద్ధికి దోహదపడదని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అధికార వికేంద్రీకరణ కోరుతూ ఆదివారం శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ స్థిరత్వం లేని నాయకుడు అని.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. చంద్రబాబు మద్దతుతో కొంతమంది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే నరసన్నపేటలో తనపై పోటీ చేసి గెలవాలని కృష్ణదాస్‌ సవాల్‌ విసిరారు.

.

.

టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోంది..
టీడీపీ చేస్తోన్న అమరావతి దీక్షలను దొంగ దీక్షలుగా వైఎస్సార్‌సీపీ నేత కిల్లి కృపారాణి అభివర్ణించారు. అధికార వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. బీజేపీకి టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారు..
అమరావతి  ఉద్యమం పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

అభివృద్ధిని అడ్డుకుంటే బుద్ధి చెబుతాం..
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. చంద్రబాబు పక్షపాత వైఖరి వలనే  ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న కృషిని చంద్రబాబు ఓర్వలేక అమరావతి ఉద్యమం ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top