ఫిరాయింపుదారులు ప్రజాద్రోహులు | ysrcp leader narayana swamy fire on party change leaders | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుదారులు ప్రజాద్రోహులు

Apr 11 2016 2:10 AM | Updated on Aug 10 2018 8:16 PM

వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రజాద్రోహులని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి

 
శ్రీరంగరాజపురం : వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలో  చేరిన ఎమ్మెల్యేలు ప్రజాద్రోహులని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఆదివారం చిన్నబాపనపల్లెలో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గతంలో టీడీపీలో ఉన్నవారు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యేలు నేడు మళ్లీ అదే పార్టీలో చేరారని తెలిపారు.


ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ప్రజలను నమ్మించి గెలిచారని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని చెప్పారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజల్లో తాను అభివృద్ధి చేస్తున్నట్లు భ్రమ క ల్పిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి, ఫిరాయింపుదారులకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఫిరాయింపుదారుల్లో ఒకరు మినహా అందరూ గతంలో టీడీపీలో ఉన్నవారేనని చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు రమణప్రసాద్‌రెడ్డి,ఉపాధ్యక్షుడు ఆనందరెడ్డి,సర్పంచ్ రామారావు, మాజీ సర్పంచ్ రామనాథరెడ్డి పాల్గొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement