రవికిరణ్‌తో ముడిపెట్టేలా ప్రశ్నించారు | ysrcp it wing incharge madhusudhan reddy quizzed by police | Sakshi
Sakshi News home page

రవికిరణ్‌తో ముడిపెట్టేలా ప్రశ్నించారు

Apr 30 2017 8:07 PM | Updated on Aug 21 2018 9:06 PM

రవికిరణ్‌తో ముడిపెట్టేలా ప్రశ్నించారు - Sakshi

రవికిరణ్‌తో ముడిపెట్టేలా ప్రశ్నించారు

గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఐటీ వింగ్‌ ఇంఛార్జి మధుసూదన్ రెడ్డి, రవికిరణ్‌లను విచారించారు.

గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఐటీ వింగ్‌ ఇంఛార్జి మధుసూదన్ రెడ్డి, రవికిరణ్‌లను విచారించారు. విచారణకు పిలిచినపుడు మళ్లీ హాజరుకావాలంటూ పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు.

విచారణానంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రవికిరణ్‌కు, వైఎస్ఆర్ సీపీకి ముడిపెట్టేలా ప్రశ్నలు అడిగారని చెప్పారు. రవికిరణ్‌తో వైఎస్ఆర్ సీపీకి సంబంధం లేదని మరోసారి చెప్పానని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి రవికిరణ్‌ సహా చాలామంది వాలంటీర్లు ఉన్నారని, అయితే వాళ్లందరినీ పోలీసులు ఉద్యోగులుగా భావిస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌పై మరోసారి ఫిర్యాదు చేసినా, పోలీసులు స్వీకరించలేదని మధుసూదన్ రెడ్డి తెలిపారు.

పోలీసులు ఒత్తిడికి తలొగ్గుతున్నారు: పోలీసులు వివక్షతతో వ్యవహరిస్తున్నారని, వైఎస్‌ఆర్ సీపీ ఫిర్యాదులను స్వీకరించడం లేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అన్నారు. చట్టపరంగా ఎవరు ఫిర్యాదు చేసినా స్వీకరించాలని, పోలీసులు ఒత్తిడికి తలొగ్గుతున్నారని చెప్పారు. రవికిరణ్‌కు వైఎస్‌ఆర్‌ సీపీతో లింక్‌ పెట్టేలా ప్రయత్నిస్తున్నారని, అదే కోణంలో విచారణ జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement