కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ హవా | Sakshi
Sakshi News home page

కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ హవా

Published Sun, Aug 31 2014 2:38 AM

ysrcp hawa in co-option members election

నందికొట్కూరు:  పురపాలక సంఘం కో ఆప్షన్ సభ్యులుగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. శనివారం పురపాలక సంఘంలో నిర్వహించిన ఎన్నికలో కరుణరత్నమ్మ, జాకీర్ హుసేన్, మేధావి వర్గంలో కృష్ణారెడ్డిలు కోఆప్షన్ సభ్యులుగా గెలుపొందారు. పురపాలక సంఘంలోని 23వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ 15 గెలుపొందింది. అయితే..రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకుడిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
ఈ ఎన్నికల్లో కోఅప్షన్ సభ్యులుగా తన వర్గం వారిని గెలిపించుకోవాలని 7గురు వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను తన వైపు తిప్పుకున్నారు. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే ఐజయ్య మాండ్ర ఎత్తులకుపై ఎత్తులు వేశారు. మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో కోఆప్షన్ మెంబర్లుగా వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయుల ఎన్నికకు మార్గం సుగమమం చేశారు. ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వైఎస్‌ఆర్‌సీపీ పురపాలక సంఘం చైర్మన్ సుబ్బమ్మ, వైస్ చైర్మన్ షేక్ అబ్దుల్ మున్నాఫ్, 2వ వార్డు గులాం మొహిద్దీన్ మగ్బూల్, వైఎస్‌ఆర్‌సీపీ 3, 4, 5, 6, 15, 18, కౌన్సిలర్లు దూదేకుల సత్తార్‌మియ్య బోయ సువర్ణమ్మ,షేక్ ముర్తుజావల్లి, సికారి నీలమ్మ,ఎస్ రామలక్ష్మమ్మ, భాస్కరరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ కోఆప్షన్ సభ్యులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ నరసింహమార్తి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు..

Advertisement
Advertisement