‘దర్జా’గా బతికేద్దాం

YSRCP Government Gives 10k Per Annum to Tailors - Sakshi

టైలర్ల చేయూతకు ఏడాదికి రూ.10 వేలు

దర్జీల సంక్షేమానికి బడ్జెట్‌లో 100కోట్లు కేటాయింపు

నియోజకవర్గంలో 1500 కుటుంబాలకు లబ్ధి

సాక్షి, జామి (విజయనగరం): దర్జీలు ఇక దర్జాగా బతకనున్నారు. వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఏటా రూ.10 వేలు ఇవ్వనుంది. దీని కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. దీని వల్ల శృంగవరపుకోటలో సుమారు 1500 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీంతో దర్జీలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి దర్జీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దర్జీలసంక్షేమం గురించి ఏనాడు పట్టించుకోలేదని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులకే ఇచ్చిన మాట ప్రకారం బడ్జెడ్‌లో నిధులు కేటాయించడంపై టైలర్లు ఆనందవ వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు మా కష్టాన్ని గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మాలాంటి కుల వృత్తులు వారికి నిజంగా అదృష్టమని టైలర్లు హర్షాతిరేకాలు తెలుపుతున్నారు.

ఇటీవల కాలంలో రెడీమేడ్‌ దుస్తులు ప్రపంచం రావడంతో గ్రామీణ ప్రాంతాలకు సైతం సోకడంతో  జీవన వృత్తిని నమ్ముకున్న టైలర్లు జీవనస్థితి దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం సంప్రదాయపద్ధతులకు ఆధారణ తగ్గడంతో చేతినిండా పనిలేక టైలర్లు రాను, రాను కనుమరుగైపోతున్నారు. రడీమేడ్‌లో వివిధ రకాల ప్యాషన్లు, డిజైన్లతో దుస్తులు రావడంతో టైలర్లు పనిలేకుండాపోతుందని టైలర్లు వాపోతున్నారు. దీంతో దర్జీలకు పనిలేకుండా తగ్గిపోతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి దర్జీల సంక్షేమంపై చిత్తశుద్ధి చూపడంతో దర్జీల్లో చిగురులు ఆశించాయి. దర్జీలకు దర్జా బతుకులు రాబోతున్నాయని వారు తెలుపుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఒకప్పుడు దర్జాగా బతికే దర్జీలు ప్రస్తుతం వారి జీవన విధానం ఆగమ్యగోచరంగా మారింది.

ముఖ్యంగా జామి మండలంలో జామిలోనే ఎక్కువుగా చేనేత వృత్తుల వారైన దేవాంగులు చేనేత వృత్తులకు ఆదరణ లేకుండా పోవడంతో వారందరు మగ్గాలను వదిలి ఎక్కువ మంది టైలర్‌వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం టైలర్‌ వృత్తి కూడా ఆదరణ లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది ఒకప్పుడు టైలరు వృత్తిలో ఉండేవారు. ఇతరత్రా పాంతాలకు కూలి, నాలి ఇతరత్రా పనులకు వెళ్తున్నారు. ఒకప్పుడు మండలంలో 400మందికి పైగా దర్జీలు ఈవృత్తిపై ఆధారపడేవారు. ప్రస్తుతం  200 మంది కుటుంబాలు వారు ఈవృత్తిపై ఆధారపడిఉన్నారు.

1500కుటుంబాలకు లబ్ధి..
శృంగవరపుకోట నియోజకవర్గంలో జామి, ఎల్‌.కోట, వేపాడ, కొత్తవలస, ఎస్‌.కోట మండలాల్లో సుమారు 1500 కుటుంబాలు వారికి తాజాగా బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో లబ్ధిచేకూరనుంది. వారికి చేయూతనిచ్చేందుకు ఏడాదికి 10వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించడం ద్వారా వృత్తి పట్ల గౌరవం పెరుగుతుందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని తెలుపుతున్నారు. 80శాతం మంది వెనుకబడిన తరగతులు వారే ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు.

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
ఇన్నాళ్లకు టైలర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. నిజంగా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. మాకు ఇప్పుడు భరోసా కలిగింది. మా వృత్తిపై గౌరవం పెరుగుతుంది.  మొదటి బడ్జెట్‌లోనే దర్జీల సంక్షేమానికి పెద్దపీట వేయడం అభినందనీయం.
– ఎస్‌.శ్రీను, దర్జీ, లొట్లపల్లి

దర్జీలకు ఎంతో ఆసరా
దర్జీలకు బడ్జెట్‌లో నిధుల కేటయించడం, సంవత్సరానికి దర్జీలకు ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రణాళికలు రూపొందించడం మా దర్జీ కుటుంబాలకు ఎంతో ఆసరా. దర్జీల కష్టాలను గుర్తించిన ముక్యమంత్రి ఒక్క జగన్‌మోహన్‌రెడ్డే. నిజంగా మా సంక్షేమానికి నిధులు కేటాయించడం మాకు వరం. 
– అల్లాడ రవికుమార్, టైలర్, జామి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top