వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్‌గా తాతినేని | ysrcp Floor Leader Tatineni | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్‌గా తాతినేని

Jul 6 2014 3:29 AM | Updated on May 29 2018 3:43 PM

జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల సమావేశం శనివారం స్థానిక

మచిలీపట్నం : జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల సమావేశం శనివారం స్థానిక ఆర్‌కే ప్యారడైజ్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా పద్మావతి పేరును పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష ప్రతిపాదించగా జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజ బ్రహ్మయ్య బలపరిచారు. దీంతో ఆమె జెడ్పీ ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిస్తామని, జెడ్పీ పాలకులు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిలదీస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement