హిందుపురం కౌన్సిల్ సమావేశంలో చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...
అనంతపురం : హిందుపురం కౌన్సిల్ సమావేశంలో చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మంగళవారం ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట వారు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా కౌన్సిల్ సమావేశం ఈరోజు ఉదయం ప్రారంభం అయిన అయిదు నిమిషాలకే ముగిసింది. ఈ చర్యను వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు.