'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి' | ysrcp complaint against magunta srinivasulu reddy to EC | Sakshi
Sakshi News home page

'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి'

Jun 23 2015 4:35 PM | Updated on Mar 23 2019 9:03 PM

'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి' - Sakshi

'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి'

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుతంత్రాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.

హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుతంత్రాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కైవశం చేసుకునేందుకు ఎంటీసీల కొనుగోలుకు టీడీపీ ప్రయత్నించడంపై ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్ లాల్ కు వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడిన టీడీపీ  అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు ఒక్కో ఎంపీటీసీకి రూ.30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న టీడీపీ ముందస్తుగా రూ.50 వేలు ముట్టజెప్పారు. ఎంపీటీసీలను నెల్లూరులోని ఓహోటల్ లో దాచిపెట్టారు. ఈ కుట్రను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం బట్టబయలు చేయడంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement