
సాక్షి, అమరావతి : గురజాల అక్రమ గనుల తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా కాసు మహేశ్ రెడ్డి, సభ్యులుగా బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌తో పాటు నరసరావు పేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.