ప్రజలకు వైఎస్ ఉగాది కానుక | ysr ugadi gift for public | Sakshi
Sakshi News home page

ప్రజలకు వైఎస్ ఉగాది కానుక

Mar 31 2014 1:12 AM | Updated on Sep 18 2018 8:37 PM

రాష్ట్రాన్ని వెలుగుతో నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రారంభించిన విద్యుత్ యజ్ఞం ఫలితాలనిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వెలుగుతో నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రారంభించిన విద్యుత్ యజ్ఞం ఫలితాలనిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు ఉగాది పర్వదినం రోజున ఉత్పత్తి ప్రారంభించనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానించనున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ రంగం నిర్మించిన విద్యుత్ ప్లాంటు భారతదేశంలో ఇదే మొదటిది కావడం గమనార్హం. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలో నిర్మించిన మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు కూడా ఇదే.

 

రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యను తీర్చేందుకు ముందుచూపుతో నాడు వైఎస్ చేపట్టిన విద్యుత్ యజ్ఞంలో భాగంగానే ప్రస్తుతం ఈ ప్లాంటు వెలుగులు విరజిమ్మనుంది. వైఎస్ హయూంలో విజయవాడ, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని పాల్వంచ వద్ద 500 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన విద్యుత్ ప్లాంట్లలో కూడా ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అయితే వైఎస్ మరణానంతరం గత నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు ఒక్క విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం చేపట్టకపోవడం గమనార్హం.
 
 మరో 800 మెగావాట్లూ సిద్ధం
 
 నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను వైఎస్ హయూంలో ప్రారంభించారు. ఈ 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణరుుంచి ఈ ప్రాజెక్టుకు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంటుగా 2007 డిసెంబర్ 12న ప్రభుత్వం నామకరణం చేసింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైగా వ్యయం కాగల ఈ ప్లాంటుకు 70 శాతం బొగ్గు ఒడిశాలోని తాల్చేరు నుంచి, మిగిలిన 30 శాతం బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రస్తుతం మొదటి 800 మెగావాట్ల ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభంకానుండగా.. మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. వచ్చే జూన్ చివరినాటికి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలో చేల్పూరు వద్ద మరో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల పనులు కూడా సాగుతున్నాయి.  
 
 నేడు గ్రిడ్‌కు అనుసంధానం: జెన్‌కో ఎండీ
 
 కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటులో సోమవారం ఉత్పత్తిని ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానించనున్నట్టు జెన్‌కో ఎండీ విజయానంద్ ‘సాక్షి’కి తెలిపారు. వరుసగా 76 గంటల పాటు ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే... అప్పుడు వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ)ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వరంగంలో దేశంలోనే మొట్టమొదటి 800 మెగావాట్ల ప్లాంటును చేపట్టడం తమకు గర్వకారణమని జెన్‌కో డెరైక్టర్ (ప్రాజెక్టులు) రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement