వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌ల నియామకం | YSR Student Ving New Incharges Appointed For Universities | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విద్యార్థి విభాగం యూనివర్సిటీ ఇంఛార్జ్‌ల నియామకం

Feb 1 2019 5:53 PM | Updated on Feb 1 2019 5:58 PM

YSR Student Ving New Incharges Appointed For Universities - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలోని యూనివర్సిటీలకు వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌లను నియమించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా బీ. మోహన్‌ నియమితులయ్యారు. నాగార్జున వర్సిటీ ఇంఛార్జ్‌గా కిరణ్ నియమితులు కాగా‌, కాకినాడ జేఎన్‌టీయూ, కేఎల్‌ వర్సిటీల బాధ్యతలను కే రాజశేఖర్‌లకు అప్పగించారు.

తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా పీ, మురళీ, ఎస్‌కేయూ, రాయలసీమ, విక్రమసింహపురి వర్సిటీలకు జీ లింగారెడ్డిను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం  శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement