మాజీ మంత్రి ఓటు తొలగింపుకు కుట్ర | YS Vivekananda Reddy Vote Missed In Pulivendula | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఓటు తొలగింపుకు కుట్ర

Mar 2 2019 2:58 PM | Updated on Mar 2 2019 4:14 PM

YS Vivekananda Reddy Vote Missed In Pulivendula - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య బద్దంగా నమోదు చేసుకున్న ఓట్లను వారి అనుమతి లేకుండానే అధికారుల అండతో ప్రభుత్వం తొలగిస్తోంది. అధికారుల, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా వారిలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలంటూ తనకు తెలియాకుండానే ఆన్‌లైన్‌లో అధికారులకు వినతిపత్రం అందింది. స్వయంగా ఆయనే దరఖాస్తు పెట్టుకున్నట్లు అధికారులకు ఫారం 7 సమర్పించారు.

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి అనుమతి లేకుండా ఓటును తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలోని పది నియోజకవర్గల్లో వైఎస్సార్ సీపీ సానూభూతిపరుల ఓట్లను టార్గెట్‌గా చేసుకుని ఆన్‌లైన్‌లోనే ఓట్ల తొలగింపు కార్యాకలపాలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందులలోని బాకరాపురంలోని 134వ వార్డులో వివేకానంద రెడ్డి కలిగి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement