నిలకడగానే జగన్ ఆరోగ్యం.. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణం | YS Jaganmohan reddy's health is stable, says jail officials | Sakshi
Sakshi News home page

నిలకడగానే జగన్ ఆరోగ్యం.. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణం

Aug 26 2013 6:11 PM | Updated on Aug 8 2018 5:51 PM

నిలకడగానే జగన్ ఆరోగ్యం.. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణం - Sakshi

నిలకడగానే జగన్ ఆరోగ్యం.. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణం

వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చంచల్గూడ జైలు అధికారులు తెలిపారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా చంచల్ గూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చంచల్గూడ జైలు అధికారులు తెలిపారు. జగన్మోహనరెడ్డి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్ర ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ ఇంతకుముందే చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే నిరాహారదీక్ష రెండోరోజున సాయంత్రం జైలు వర్గాలు ఈ వివరాలు తెలిపాయి.

అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విజ్క్షప్తికి జైళ్ల శాఖ ఐజీ సానుకూలంగా స్పందించారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల చేస్తామని ఐజీ సునీల్ కుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement