శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్‌ పర్యటన | YS Jaganmohan Reddy Tour in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్‌ పర్యటన

May 19 2017 3:02 AM | Updated on Apr 4 2018 9:25 PM

శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్‌ పర్యటన - Sakshi

శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్‌ పర్యటన

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం తొలిరోజున పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ  కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను జగన్‌ కలుసుకుని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు.

నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వరద రామారావు
ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరదరామారావు శుక్రవారం ఉదయం 11 గంటలకు రణస్థలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ గురువారం విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement