నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కోరిన జగన్.. ఇదే సమయంలో పార్లమెంటు వేదికగా మరోసారి పలు పార్టీల మద్దతు కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు వీలుగా ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ను కోరారు.
కాగా రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన సభ్యులందరూ సహకరించాలని కేంద్ర మంత్రి కమల్నాథ్ విజ్ఞప్తి చేశారు.