‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌ | ys jagan mohanreddy launches new web site www.annavastunnadu.com | Sakshi
Sakshi News home page

‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌

Jul 16 2017 2:33 AM | Updated on Jul 25 2018 4:45 PM

‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌ - Sakshi

‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట తలపెట్టిన సాహసోపేతమైన పాదయాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రత్యేకంగా ‘అన్న వస్తున్నాడు డాట్‌ కామ్‌’ వెబ్ సైట్ ను రూపొందించారు.

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట తలపెట్టిన సాహసోపేతమైన పాదయాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రత్యేకంగా ‘అన్న వస్తున్నాడు డాట్‌ కామ్‌’ వెబ్ సైట్ ను రూపొందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ వెబ్‌సైట్‌ను శనివారం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

అక్టోబర్‌ 27వ తేదీ నుంచి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా చేయతలపెట్టిన చారిత్రాత్మకమైన పాదయాత్రను పురస్కరించుకుని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని ఐ.వి.రెడ్డి తెలిపారు. జగన్‌కు సంబంధించిన అన్ని అంశాలు, పాదయాత్ర ప్రారంభించిన తరువాత ఎప్పటికపుడు తాజా వివరాలు ఇందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ను రూపొందించినందుకు ఐ.వి.రెడ్డి బృందాన్ని వైఎస్‌ జగన్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement