
సాక్షి, అమరావతి: కృష్ణమ్మ పరవళ్లతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.