ఎన్పీఆర్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌ | YS Jagan Mohan Reddy Response On NPR | Sakshi
Sakshi News home page

ఎన్పీఆర్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

Mar 3 2020 6:07 PM | Updated on Mar 3 2020 6:30 PM

YS Jagan Mohan Reddy Response On NPR - Sakshi

సాక్షి, తాడేపల్లి​ : జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్‌) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఎన్పీఆర్‌ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement