
పిఠాపురం టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సాయంత్రానికి పిఠాపురం నియోజకవర్గం చేరుతుందని పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తెలిపారు. పార్టీ ప్రోగ్రాం కో ఆర్టినేటర్ తలశిల రఘురామ్ ఈ విషయాన్ని చెప్పినట్టు తెలిపారు. పెద్దాపురం మండలం దివిలి మీదుగా నియోజకవర్గంలోని పిఠాపురం మండలం విరవలో ప్రజా సంకల్పయాత్ర మొదలవుతుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభలో పార్టీ అధినేత మాట్లాడతారన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని వారు కోరారు. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తొలుత ప్రజా సంకల్పయాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ ప్రోగ్రాం కో ఆర్టినేటర్ తలశిల రఘురామ్ పరిశీలించారు. ఉప్పాడ సెంటర్ చేపట్టే బహిరంగ సభ ప్రదేశాన్ని, యాత్ర సాగే రూట్‌ను ఆయన పరిశీలించారు. పార్టీ నియోజకవర్గ పార్టీ కో ఆర్టినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావుతో కలిసి ఆయన బహిరంగ సభ, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొజ్జా రామయ్య, ఆనాల సుదర్శన్, కర్రి ప్రసాద్, బోను దేవా తదితరులు పాల్గొన్నారు.
కత్తిపూడిలో పరిశీలన
ఏలేశ్వరం (ప్రత్తిపాడు): ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో ప్రవేశించే ప్రజా సంకల్ప యాత్ర రూట్‌మ్యాప్‌ను శనివారం వైఎస్సార్ సీపీ నేతలు పరిశీలించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రోగాం కో ఆర్డినేటర్ తలశిల రఘరామ్, పార్టీ జిల్లా ప్రాంతీయ పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాదయాత్ర సాగే రూట్‌ను పరిశీలించారు. అనంతరం కో ఆర్డినేటర్ ప్రసాద్‌కు పలు సూచనలు చేశారు.