
సాక్షి, విజయనగరం: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పిల్లల ఎదుగుదల కోసం, వారి అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఉత్తమమైన ప్రదేశంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంకల్పయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పిల్లలందరిని చదివించే బాధ్యత తీసుకుంటామని నవరత్నాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Happy children’s day! For your sake, I vow to make our state a better place for you to grow up and flourish in.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 14 November 2018