సువర్ణాక్షరాలతో..

YS Jagan Memories In Krishna Praja Sankalpa Yatra - Sakshi

జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అక్కున చేర్చుకున్న ‘కృష్ణా’భిమానం   

ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రజా సంకల్ప యాత్ర

ప్రతీ నియోజకవర్గంలోనూ బ్రహ్మరథం

నేటితో మహా ఘట్టం ముగియనుండడంతో ఇచ్ఛాపురానికి కదిలిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవటానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లాలో విశేష ఆదరణ లభించింది. 25 రోజులపాటు జరిగిన ఈ యాత్ర జిల్లాలోని 12 నియోజకవర్గాల గుండా 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లో, 130 గ్రామాల మీదుగా  239 కి.మీ. మేర సాగింది. గతేడాది ఏప్రిల్‌ 14న గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారథి మీదుగా జిల్లాలో ప్రవేశించింది. ఆయన అడుగులో అడుగేసేందుకు వేలాదిమంది కదం తొక్కారు. అదే రోజు విజయవాడ చిట్టినగర్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభతో జిల్లా ప్రజలకు జననేత పట్ల ఉన్న ఆదరాభిమానాలను తెలియజేసింది. ఆ తర్వాత మైలవరం, నూజివీడు, గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం, పెడన, గుడివాడ, కైకలూరులలో కూడా ఇసుకేస్తే రాలనంత జనం, కనుచూపుమేర అభిమానసంద్రం పోటెత్తింది. చరిత్రలో చరగని ముద్ర వేసిన ప్రజాసంకల్పయాత్ర గతేడాది మే 13న కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం మణుగునూరు లంక వద్దదిగ్విజయంగా ముగిసింది.

నాలుగు ఆత్మీయ సభలు..
జిల్లాలో పాదయాత్రలో వివిధ సామాజిక వర్గాలతో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ కౌతారం వద్ద ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదులతో, కైకలూరు నియోజకవర్గం పెరిగెగూడెంలో దళితులతో, గుడివాడ నియోజకవర్గం అగ్రహారం వద్ద నాయీ బ్రాహ్మణులతో, మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాలెం వద్ద విశ్వబ్రాహ్మణులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయా వర్గాలపట్ల జననేత జగన్‌కు ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటాయి. ఈ సభల్లో భాగంగా దళితులకు వైఎస్సార్‌ పెళ్లి కానుక, సబ్సిడీతో రుణాలు వంటి హామీలను ప్రకటించారు. న్యాయవాదులకు 100 కోట్ల రూపాయలతో సంక్షేమనిధి, విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కీలక నిర్ణయాలు..
పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరును పెడతామన్న హామీ పెనుప్రకంపనలను సృష్టించింది. కొల్లేరు ప్రజల కష్టాలను చట్టసభల్లో ప్రశ్నించటానికి ఆ ప్రాంత వాసికి ఎమ్మెల్సీని చేస్తామన్నారు. కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌)ను  ప్రకటించారు.

తరలిన వైఎస్సార్‌ సీపీ దండు
సాక్షి, అమరావతిబ్యూరో : చరిత్రపుటల్లో నిలిచిపోయే అపూర్వ ఘట్టంలో పాలుపంచుకునేందుకు కృష్ణా జిల్లా నుంచి జన జాతర ఉప్పెనలా కదలివెళ్లింది. 14 నెలల కిందట జననేత వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. పల్లెపల్లెను పలుకరిస్తూ.. ప్రజలతో మమేకమవుతూ.. ప్రతిపక్ష నేత జగన్‌ సాగించిన పాదయాత్ర ముగింపు సభకు కృష్ణా జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు కదలివెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. 

తరలివెళ్లిన జనప్రవాహం
ప్రజాసంకల్ప యాత్రికుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజయవాడ ప్రజలు ఆత్మీయ తివాచీతో స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న కనకదుర్గ వారధిపై నుంచి జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌కు అభిమాన జనసందోహం ఎదురేగి జిల్లాలోకి సాదరంగా తోడ్కొని వచ్చింది. జననేతను అనుసరిస్తూ వేలాదిమంది అభిమానులు వారథిపై కదం తొక్కారు. అప్పుటి నుంచి జిల్లాలో యాత్ర ముగిసే వరకు వైఎస్‌ జగన్‌ను వెంట అడుగులో అడుగు వేసిన వేలాది మంది ఇప్పుడు ముగింపు యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివెళ్లడం గమనార్హం. 

పార్టీ నేతల సంఘీభావం..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర ముగింపు అపూర్వ ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. సోమవారం రాత్రి నుంచి కొనసాగించి మంగళవారం రాత్రిలోగా వేలాది మంది ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు తరలివెళ్లారు. విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి పలువురితో కలిసి సోమవారం ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త యలమంచిలి రవితో పాటు, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పలువురు సోమవారం రాత్రికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. కాగా పార్టీ అభిమానలు ఇతర నాయకులు రెండు బస్సుల్లో మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు.
అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్, పలువురు పార్టీ నాయకులు సోమవారం రాత్రి ఇచ్ఛాపురం తరలి వెళ్లారు.
నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మేకా వంకాప్రతాప్‌ అప్పారావుతోపాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు ఇచ్ఛాపురం తరలి వెళ్లారు.
నందిగామ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ జగన్‌మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌లతో పాటు కొందరు ముఖ్య నాయకులు కలిసి తమ వాహనాల్లో 100 మందితో మంగళవారం సాయంత్రం కాన్వాయ్‌గా బయలుదేరారు.
కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, ఆయన కుమారులు వినయ్, శ్యామ్‌లతోపాటు పార్టీ రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి పోసిన పాపారావుగౌడ్, ప్రచార కమిటీ రాష్ట్ర్‌ర కార్యదర్శి వాసిపల్లి యోనా, రాష్ట్ర యువజన సంఘం నాయకుడు దాసరి అబ్రహం లింకన్, జోగి సురేష్‌లు తరలివెళ్లారు.
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల సమన్వకర్తలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు కలిసి వెళ్లారు.
పెడన నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త జోగిరమేష్, మున్సిపల్‌ చైర్మన్‌ బండారు ఆనందప్రసాద్‌ ఇచ్ఛాపురం వెళ్లారు.
గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో పది వాహనాల్లో ముఖ్యనాయకులు, పార్టీ శ్రేణులు ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. మరో 100 మందికిపైగా సోమవారం రాత్రే తరలివెళ్లడం జరిగింది.
తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో సోమవారం 100 మందికిపైగా కార్యకర్తలు తరలివెళ్లారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో సోమవారం పలువురు కార్యకర్తలు ఇచ్ఛాపురం పయనమయ్యారు.
మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకటరామయ్య(నాని) తన అనుచరులతో కలిసి వెళ్లారు.
పామర్రు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పలు వాహనాల్లో సోమవారం ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ సమన్యయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుతో పాటు పలువురు నేతలు సభకు పయనమయ్యారు.

పార్టీ జిల్లా అనుబంధ సంఘాలు..
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు సోమవారమే ఇచ్ఛాపురానికి పలు వాహనాల్లో తరలి వెళ్లారు. తరలి వెళ్లినవారిలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అ«ధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, విజయవాడ పార్లమెంట్‌ జిల్లా డాక్టర్స్‌ సెల్‌ అ«ధ్యక్షుడు డాక్టర్‌ మహబూబ్‌ షేక్, బీసీ సెల్‌ కొసగాని దుర్గారావు గౌడ్, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు తోకల శ్యామ్‌కుమార్, లీగల్‌సెల్‌ అధ్యక్షుడు కోటంరాజు వెంకటేష్‌శర్మ, రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, 15వ డివిజన్‌ విద్యార్థి విభాగం అ«ధ్యక్షుడ శివ, మైలవరం నియోజకవర్గం విద్యార్ధి విభాగం అ«ధ్యక్షుడు నాగిరెడ్డి, మైనార్టీ విభాగం కార్యదర్శి గౌసాని, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కర్నాటి రాంబాబు ఉన్నారు.

జననేతతో నడవటం గొప్ప అనుభూతి
కంకిపాడు(పెనమలూరు): కృష్ణాజిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటే నడుస్తున్నాను. 11 నెలల పాటు ఆయనతో కలిసి ప్రయాణం చేయటం మరచిపోలేని అనుభూతి. అనేకవర్గాల ప్రజలు ఎదురేగి ఆయనకు సమస్యలు విన్నవించటం, ఎంతో ఓపికగా జగన్‌ సమస్యను వినడం.. వారికి భరోసా కల్పించడం చూస్తున్నా.. జగన్‌ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పుట్టిన రోజు, పండుగలు, కొత్త సంవత్సర వేడుకలు కూడా ఆయనతో పాటే జరుపుకున్నాం. రోజూ ఆయన రమమ్మ తల్లి అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింతగా పనిచేస్తా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top