చ‌క్కెర ఫ్యాక్ట‌రీల పున‌రుద్ధ‌ర‌ణ‌పై సీఎం స‌మీక్ష‌

YS Jagan   Held A Conference On The Revival Of Sugar Factories - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి :  స‌హ‌కార రంగంలోని చ‌క్కెర ఫ్యాక్ట‌రీల పున‌రుద్ధ‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు. రైతుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల వివ‌రాలు ఆరా తీసిన సీఎం.. వారికి ఒక్క రూపాయి కూడా బ‌కాయిలు లేకుండా తీర్చాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఈనెల 8న రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా 54.6 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. దీంతో శ్రీ విజయరామ గజపతి ఫ్యాక్టరీ కింద రూ.8.41 కోట్లు, చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో రూ.22.12 కోట్లు, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ కింద రూ.10.56 కోట్లు, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో రూ.8.88 కోట్లతో పాటు, అనకాపల్లి షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు రూ.4.63 కోట్ల బకాయిలను  ప్రభుత్వం చెల్లించ‌నుంది. దీంతో దాదాపు 15 వేల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. (సీఎం జగన్‌ను అభినందించిన పవన్‌ కల్యాణ్‌ )

ప్ర‌స్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ఎంత వ‌ర‌కు వినియోగించ‌గ‌ల‌మో ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీలు స‌హా వివిధ ప్రాంతాల్లో చ‌క్కెర నిల్ల‌లు చేసేలా చూడాల‌న్నారు. దీని వల్ల చక్కెర ఫ్యాక్టరీలకు మేలు జరుగుతుంద‌న్నారు.  సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలపై మరింత లోతుగా అధ్య‌య‌నం చేసి   కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారులు, మంత్ర‌లను  సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఆగ‌స్టు 15 నాటికి వీటికి సంబంధించిన స‌మ‌గ్ర నివేధిక సిద్ధం చేయాల‌ని తెలిపారు. (అచ్చెన్నాయుడుకు చుక్కెదురు )

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top