కొండంత అభిమానం | YS Jagan Fan Climb Temple Hill With Knees For Wish Complete | Sakshi
Sakshi News home page

కొండంత అభిమానం

Jun 3 2019 1:27 PM | Updated on Jun 3 2019 1:27 PM

YS Jagan Fan Climb Temple Hill With Knees For Wish Complete - Sakshi

మోకాళ్లతో గుణదల కొండపైకి ఎక్కుతున్న రవీంద్ర బాబు కొండను ఎక్కే క్రమంలో ఎండదాటికి సొమ్మసిల్లిన రవీంద్రబాబు

జగన్‌ సీఎం అయ్యాడని మొక్కు తీర్చుకున్న అభిమాని

చీరాల రూరల్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఓ యువకుడు కొండంత అభిమానం చూపాడు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేవిజయవాడ గుణదలలోని మేరిమాత ఆలయం (కొండపైకి) వద్దకు మోకాళ్లతో ఎక్కుతానని ప్రతిన బూనాడు. తన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో అతడు ఆదివారం మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గుణదల కొండపైకి మోకాళ్లతో ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. చీరాల హారిస్‌పేటకు చెందిన మల్లెల రవీంద్రబాబు ఇంటర్‌ పూర్తి చేసి కొరియర్‌ ఆఫీసులో పనిచేస్తుంటాడు. అతడికి వైఎస్‌ జగన్‌ అంటే ప్రాణం. ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా తన సొంత ఖర్చులతో హాజరవుతాడు. తనకు వచ్చే సంపాదనలో కొంత మొత్తం కుటుంబానికి ఖర్చుచేసి మిగిలిన కొద్ది మొత్తాన్ని దాచుకుని సమావేశాలకు హాజరవుతుంటాడు. జగన్‌మోహన్‌రెడ్డి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కనుక తాను ప్రతి ఏడాది మే 30న మేరీ మాత ఆలయమైన గుణదల కొండపైకి మోకాళ్లతో ఎక్కుతానని ప్రతిన బూనాడు. మోకాళ్లతో కొండపైకెక్కిన రవీంద్ర బాబును పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement