రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan Bharosa Yatra in Venkatapalli Pedatanda | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

May 15 2015 7:52 PM | Updated on Jul 25 2018 4:09 PM

రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.

అనంతపురం: రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. వజ్రకరూరు మండలం పందికుంట ఓబులేసు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

ఉరవకొండ మండలం వెంకటపల్లి పెదతండాలో ఆత్మహత్య చేసుకున్న గోవింద్ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. యువకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement