యూట్యూబ్ చానల్స్ ప్రతినిధుల బరితెగింపు

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని అనపర్తిలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని యూట్యూబ్ చానళ్లకు చెందిన ప్రతినిధులు బరితెగించి.. ఓ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. తొలుత సదరు వ్యాపారిని యూట్యూబ్ చానళ్ల ప్రతినిధులు డబ్బు డిమాండ్ చేశారు. అయితే నగదు ఇచ్చేందుకు వ్యాపారి నిరాకరించడంతో.. అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వ్యాపారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాధిత వ్యాపారి పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ధాన్యం వ్యాపారం చేస్తాను. ఆదివారం లోడ్‌ను అడ్డగించిన కొందరు వ్యక్తులు విజిలెన్స్ అధికారులమని చెప్పి.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసకున్న నేను అక్కడికి వెళ్లాను. వారిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని చూడగా.. నాపై దాడి చేసి పారిపోయారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి