క్వారీగుంతలో పడి యువకుడు గల్లంతు | Youngster missing in Quarry pit | Sakshi
Sakshi News home page

క్వారీగుంతలో పడి యువకుడు గల్లంతు

Jul 6 2015 5:58 PM | Updated on Sep 3 2017 5:01 AM

క్వారీగుంతలో ఈతకెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు.

గంగాధర్‌నెల్లూరు (చిత్తూరు జిల్లా) : క్వారీగుంతలో ఈతకెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రానికి చెందిన చంద్ర(21) అనే యువకుడు స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీ గుంతకు ఈతకెళ్లాడు.

ఈ క్రమంలోనే క్వారీ గుంతలో దూకిన చంద్ర గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు పోలీసులకు తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement