యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా | Young man were taken to the swimming fun | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా

Aug 22 2013 1:24 AM | Updated on Sep 1 2017 9:59 PM

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మండలంలోని యనమదలలో బుధవా రం ఈ ఘటన జరిగింది. రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ..

యనమదల(నూజివీడురూరల్) : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మండలంలోని యనమదలలో బుధవా రం ఈ ఘటన జరిగింది. రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ..నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయి నాగశేషు(27) మరో నలుగురు  సరదాగా గడిపేందుకు బుధవారం మండలంలోని యనమదల గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని నీలాద్రి చెరువులో స్నానం కోసం దిగారు.

నాగశేషు లోతుగా ఉన్న వైపు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. నాగశేషు వెంట ఉన్న నలుగురు వ్యక్తులు విషయాన్ని అతడి కుటుంబసభ్యులకు తెలపడంతో వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. రూరల్ పోలీసులు, అగ్నిమాపక సి బ్బందితో చెరువు వద్దకు వచ్చి, గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు నాగశేషు ఆచూకీ లభించకపోవడంతో ఉ న్నతాధికారుల సూచనల మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బంది గ్రామానికి చేరుకొని నాగశేషు కోసం గాలించారు.

సాయంత్రం  ఏడున్న ర గంటల సమయంలో అతడి మృతదేహం లభ్యమవ్వటంతో పోస్టుమార్టం కో సం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చే సి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై ఆదిప్రసాద్ తెలిపారు. ఘటనాస్థలిని సీఐ మురళీకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ ఎస్వీ జగన్నాధరావు తదితరులు పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement