రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం | young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Jun 17 2018 8:50 AM | Updated on Sep 28 2018 3:39 PM

టెక్కలి రూరల్‌: మండంలోని చాకిపల్లి కొత్తూరు జాతీయ రహదారి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రట్టి గురుచరణ్‌ (22) అనే యువకుడు మృతి చెందాడు. టెక్కలిలోని ఎన్‌టీఆర్‌ కాలనీలో నివాసముంటున్న గురుచరణ్‌ స్థానికంగా ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. ఉదయం విధులను ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే బైకుపై కొత్తూరులోని బంధువుల ఇంటికి వెళ్లి మామిడిపండ్లు తీసుకొని తిరిగి వస్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. 

ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో గురుచరణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణం దక్కేదని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. గురుచరణ్‌ మృతి చెందాడన్న వార్త తెలియగానే తండ్రి ప్రభాకరరావుతో పాటు పెట్రోల్‌ బంకు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్‌ఐ సురేష్‌బాబు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement