నిమజ్జనంలో అపశ్రుతి.. చావుతో పోరాడిన యువకుడు

Young Man Drowns In Prakasam Barrage During Ganesh Immersion - Sakshi

సాక్షి, విజయవాడ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రకాశం బ్యారేజ్‌లోని సీతమ్మ వారి పాదాల ఘాట్‌ వద్ద గణేష్‌ నిమజ్జానాన్ని తిలకిస్తున్న ఓ యువకుడు బ్యారేజ్‌లో పడిపోయాడు. వరద ప్రవాహానికి ఆ యువకుడు చాలా దూరం కొట్టుకుపోయాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం అప్రమత్తం కావడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ చావుతో పోరాడుతున్న యువకుడిని  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సభ్యుడు నరేష్‌ సోనియా రెస్క్యూ చేసి కాపాడారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు సుధాకర్‌గా గుర్తించారు. కాగా, ప్రాణాలకు తెలిగించి యువకుడిని కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సందర్శకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రెస్య్యూ చేసి యువకుడిని కాపాడిన నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యారేజ్‌ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top